ఆశ్రయమా నా ఆధారమా
పల్లవి) ఆశ్రయమా నా ఆధారమా -నీవేనయ్య నజరేయుడా జీవమా నా జీవితము-నీవేనయ్యా నా యేసయ్య అనుదినము నీ వాత్సల్యం చూపి-దిన దినము నీ దృష్టిలో నన్నుంచుకున్నావయ్యా అనుపల్లవి) నిన్ను స్తుతించకుండా నేనుండలేనయ్య యేసయ్య నిన్ను గూర్చి చెప్పకుండా బ్రతకలేనయ్య 1) ప్రతి వత్సరం నీ దయతో నాకిచ్చుచున్నావయ్యా ప్రతి ఉదయమున నీ కృపతో నన్ను నింపుచున్నావయ్యా బ్రతికేదన్నయ్య యేసయ్య నాకు బ్రతుకు నిచ్చిన నీ కొరకే నిలిచెదనయ్య యేసయ్య నన్ను బండమీద నిలిపిన నీ కొరకే 2) కునుకు పాటు రాదయ్య నీ కంటికి నీ కంటిపాపలా నన్ను కాపాడుచుంటివి కనికర సంపన్నుడా యేసయ్య కంచెగల తోటలో నన్ను ఉంచావయ్య అడిగి ఊహించు వాటికంటే యేసయ్య అధికముగా ఇచ్చి నన్ను దీవించావే


Follow Us






