దివ్యతేజోమయా యేసయ్యా
దివ్యతేజోమయా యేసయ్యా నీతి నియమాలకు నిలయమా నినునమ్ము నీజనుల - న్యాయాధిపతి నీవై నడిపితివి జయధ్వజముతో నిత్యం నీకే నా ఆరాధన నీవే నీవే నా స్తుతికీర్తన బలవంతుడా మహాశూరుడా పలుశోధనలలో నాతోడై నా కుడి పార్శ్వమందుండినావు నీ మహిమకై నీవేర్పరచిన నీ పాత్రగా నను మార్చినీవు నీ ఎనలేని ప్రేమను చూపితివి నీవే నీవే నా విజయం నాలో నీవే నీవే ఆనందం నీవే నీవే నా విజయం నాలో నీవే నీవే మహదానందం అభిషిక్తుడా నా ప్రాణేశ్వర నా నీడవలె నాతోనుండి నను రక్షించి పోషించినావు నేనెన్నడూ నాకై ఆశించని నీ దీవెనలతో తృప్తిపరచి నన్నీ స్థితిలో నీవు నిలిపినావు నీవే నీవే నా ప్రాణం నాలో నీవే నీవే నా ధ్యానం నీ వాక్యమే నన్ను బ్రతికించెను నా బాధలలో నెమ్మదినిచ్చి గొప్ప ఆదరణ కలిగించె నాలో మన్నైనది మన్నైపోవునని నను జీవాత్మతో నింపినీవు నీ రూపుగా నను మార్చినావే నిత్యం నీతో నడుపుటకు నీవు నాలో నాతో ఉన్నావే


Follow Us






