రక్షకుని జన్మస్థలమా
రక్షకుని జన్మస్థలమా యూదయ బెత్లహేమా (2) ఆరాధనలకు ఆరంభమా హృదయార్పణలకు నివాసమా (2) ఎందుకో ఇంత భాగ్యము దాచిఉంచే ప్రభు నీకోసము (2) స్తుతియు మహిమ ప్రభావము ఎల్ల వేళల ప్రభుకే చెందును (2) // రక్షకుని // 1. ప్రవచించే నాడు ప్రవక్తలు క్రీస్తు జన్మ శుభవార్తను ఆశించే నాడు కన్యలు ప్రభువుకు జన్మ నివ్వాలని (2) తండ్రి చిత్తమే నెరవేరగా కన్య మరియకే ప్రాప్తించగా జన్మించే యేసు మహారాజుగా – కాలము విడిపోయే రెండుగా (2) // స్తుతియు // 2. నోటి మాటతో సృష్టిని తనచేతులతో ఈ మనిషిని చేసిన దేవుడు దీనుడై పవళించెను పశువుల పాకలో (2) నీ చరిత్రనుమార్చు దేవుడు తన మహిమనే నీ కిచ్చెను యూదా ప్రధానులందరిలో – నీవు అల్పమైనదానవు కావు (2) // స్తుతియు // 3. దివిలోని దూతగణములు సైన్య సమూహమై దిగివచ్చిరి సర్వశక్తి సంపన్నునికి స్తోత్ర గీతమే అర్పించిరి (2) సర్వలోక కల్యాణముకై లోక పాప పరిహారముకై దిగివచ్చిన యేసు పూజ్యుడని – అర్భాటించి కీర్తించెనుగా (2) // స్తుతియు // 4. రక్షకునిచూడవచ్చిన ఆ గొల్లలు జ్ఞానుల సందడితో రాజులగుమ్మమును చేరెను అగోచరుడైన యేసువార్తలు (2) సింహ స్వప్నమై నిలిచెనుగా సింహాసనములు అదిరెనుగా శిరమువంచి శ్రీమంతునికి – సాటిలేరని కొలిచిరిగా (2) // స్తుతియు //


Follow Us






