ఈ క్షణమున నేను బ్రతికున్నానంటే
ఈ క్షణమున నేను బ్రతికున్నానంటే అది కేవలం నీ కృపయేనయ్యా ప్రతి క్షణము నా వెన్నంటి నడచినావు కంటి పాపలా నన్ను కాచినావు స్తోత్రం యేసయ్యా... స్తోత్రం యేసయ్యా స్తోత్రం యేసయ్యా... నీకే స్తోత్రమయ్యా నిరాశలో ఉన్నప్పుడు ఆశగా చిగురించావు శోధనలో ఉన్నప్పుడు వేదన తొలగించావు నీకు సరిపోల్చగా వేరెవరు లేరయ్యా నిను గాక దేనిని నే కోరలేనయ్యా బ్రతుకంతా నీ కొరకై ఇలా జీవింతునయ్యా కలవరమందు ఉన్నప్పుడు కలతను తొలగించావు ఒంటరినై ఉన్నప్పుడు నా సమూహమైనావు నీవంటి దేవుడు ఇంకెవరు లేరయ్యా నీ ప్రేమకై నేను ఏమివ్వగలనయ్యా బ్రతుకంతా నీ కొరకై ఇలా జీవింతునయ్యా పాపమునందు ఉన్నప్పుడు నాకై బలి అయినావు శాపమునంతా తొలగించి పరిశుద్ధతనిచ్చావు నీదు బలి యాగమే నన్ను బ్రతికించినది నీ సిలువ యాగమే నన్ను రక్షించినది బ్రతుకంతా నీ కొరకై ఇలా జీవింతునయ్యా


Follow Us






