LOADING


Pastor Rajesh Ipc
  • Home
  • About Us
  • Live Telecast
  • Videos
  • Bible
  • Dictionary
  • Audio Lyrics
  • Audio Songs
  • Books
  • Image Gallery
  • Location
  • Contact Us
  • Donate
menu


ఘనుడవు నీవే పరిశుద్ధుడవు నీవే


ఘనుడవు నీవే పరిశుద్ధుడవు నీవే
నీ మమతల అనురాగం నానోట స్తుతిగానం
నీవు చేసిన వాగ్దానం నా జీవిత ఆధారం
ఎలా మరుచనయ్యా నీవు చేసిన స్నేహము
నేనెలా దాచనయ్యా నే పొందిన విజయము

విలువైనది నీ వదనము సాటిలేని తేజము
ఘనమైనది నీ వాక్యము శాశ్వత జీవము
నీప్రేమే మధురము నీ మాటే మకరందము
నీ చూపే వాత్సాల్యము నీ మనసే ఉన్నతము
ఎలా మరుచనయ్యా నీవు చూపిన ప్రేమను
నేనెలా పొగడనయ్యా నీ ఉన్నత కృపలను  

శ్రమలోయలో గుండె చెదరగా నిలిచినావు తోడుగా
కన్నీళ్ళలో కృంగియుండగా చూపినావు నీ కృప
నే పొందిన శ్రమలలో నా దీవెన దాచావు
నే కార్చిన కన్నీటిలో నీ దర్శన మిచ్చావు
ఎలా మరువనయ్యా నీవు చేసిన మేలును
నేనెలా తీర్చనయ్య నీదు ఋణమును

అడుగడుగున అవమానమే మోయలేని భారమే
ప్రతి క్షణమున యెడబాయక వెంట నిలిచే దైవమా
పరిచర్య ప్రాణమై నడిపినాపు ప్రగతిలో
సంఘ క్షేమమే ఊపిరై నింపినావు మహిమతో
ఎలా మరువనయ్యా నీవు నడిపిన మార్గము
నేనెలా మరతునయ్య నీవు చేసిన త్యాగము

Sharing Button Hover Effect
Follow Us

   Jesus Words