మహా రాజువే మా నాయకుడవే
మహా రాజువే మా నాయకుడవే నడిపించు నా దైవమే ప్రతీ స్థలమునా జతె చేరినా ప్రియమైన నా హితుడవే ||2|| ప్రతి స్థితిలోన నడిపిన వైనం ఆశ్చర్యమే కలిగించే ప్రతి క్షణం ||2|| ఆరాధింతును అను నిత్యము నిను కొనియాడెదను నిరతము ||2|| శత్రు భయముతో మది అలజడితో మార్గమే కానక నిలచిన వారికి ||2|| చెదరిన గుండెకు బలమివ్వగా నిలిపితివి సంద్రము జలరాశిగా విస్మయ మొందెను వెనుతిరుగగా మరణించే శత్రువు కనిపించక స్తుతియుంచుచూ సాగేనాపయనము చేర్చితివి క్షేమముగా ఆ గమ్యము ||2|| మంటిని కూర్చి పాత్రగ మలచి నీ పోలికనిచ్చి మహిమగ తీర్చి ||2|| నిలిపితివి నన్ను నీవానిగా ఆత్మల రక్షణకై ఒక ప్రమిదగా సాగెదను నేను నీ సాక్షిగా నీ స్వరము నాలో ధ్వనియించగ ఇదే నాకు నిజమైన నిరీక్షణ నీ కౌగిలిలో నాకు సంరక్షణ ||2|| మరణము గెలిచన మృత్యుంజయుడవు మహిమతో దిగివచ్చు నా మహారాజువు ||2|| నీ మహిమ రాజ్యములో నిలవాలని జయించినవారితో గడపాలని ఈ వాంఛ తీరగ తెరువేదని అక్షయుడా చేరితి నీ శరణి వర్ణింపలేనయ్య నా భాగ్యము కడవరకు కృపలోనే నా పయనము.


Follow Us






