ఆత్మీయుడా నాకున్న మంచి స్నేహితుడా
ఆత్మీయుడా నాకున్న మంచి స్నేహితుడా బలవంతుడా నాకున్న బలము నీవయ్యా (2) ఏ సుడిగాలులు ఎదురొచ్చినా గాలి తుఫానులు చెలరేగినా (2) నాకున్న బలము నీవయ్యా నాకున్న ధైర్యం నీవయ్యా (2) 1. అలసట నొందినా - ప్రతి సమయములో ఓర్పు నీవైతివి - నేర్పుగా నడిపితివి అల్లుకుపోయినా - అపనిందలలో నీవు మోసితివి - భారము తీర్చితివి (2) నాతో నీవుంటే - ఏ భయమూ లేదు నాతో నీవొస్తే - ఏ దిగులూ లేదు (2) 2. అనుకూలతలో - నా అవసరములో నీవు కనుగొంటివి - నన్ను నిలిపితివి అమృతమైన - నీ ఓదార్పుతో నన్ను చేరితివి - బ్రతుకును మార్చితివి (2) శత్రువులంతా - నా చుట్టూ ఉన్నా బంధువులంతా - నన్నోదిలేస్తున్నా (2)


Follow Us






