LOADING


Pastor Rajesh Ipc
  • Home
  • About Us
  • Live Telecast
  • Videos
  • Bible
  • Dictionary
  • Audio Lyrics
  • Audio Songs
  • Books
  • Image Gallery
  • Location
  • Contact Us
  • Donate
menu


కన్నీళ్లే కీర్తనలాయే


కన్నీళ్లే కీర్తనలాయే గాయాలే గానాలాయే...
కాచినావు కాపాడేదవు, మోసినావు మోయుదువు
మారని దేవా మహోన్నత ఇదియే మా కృతజ్ఞత 
ఎలా తీర్చగలను నీ ఋణమును


అర్హతే లేని నాపై అంతులేని కృపను చూపి..
ప్రేమతో పిలచితివి తండ్రీవై మోసితివి 
నే తూలిన ప్రతి క్షణాన భుజములపై మోసితివి 
నమ్మకమే లేని నన్ను నమ్మిన ప్రేమవు నీవు 

నే చూడని యుద్ధాలు నీవే పోరాడితివి
తెలియని ఆపద నుండి నీవే కాపాడితివి 
నేనడుగని దీవెనలు మెండుగా నొసగితివి 
నాదు బలహీనతకంటే కృపయే బలమైనది 

వాగ్దానములనిచ్చి జీవాలయము కట్టి
నీ స్పర్శ తాకిన వారే సాక్షులుగా నిలిచినారే 
నీదు సమృద్ధి చేత పోషించుచున్నావే 
మా ప్రేమ మారినా నీ ప్రేమ మారదు 

మహిమయే లేని చోట మహిమను రప్పించావే
ఇంతవరకు సహాయకుడవై ఎబినేజరువైనావే
గొర్రె పిల్ల రక్తముతో మా కథనే వ్రాసావే 
నీ పిలుపు మారదు ఎన్నడూ ఓడిపోదు

Sharing Button Hover Effect
Follow Us

   Jesus Words