LOADING


Pastor Rajesh Ipc
  • Home
  • About Us
  • Live Telecast
  • Videos
  • Bible
  • Dictionary
  • Audio Lyrics
  • Audio Songs
  • Books
  • Image Gallery
  • Location
  • Contact Us
  • Donate
menu


నా అక్కరలన్నీయు ఎరిగినవాడవు


నా అక్కరలన్నీయు ఎరిగినవాడవు -
నా అవసరములన్నీ తీర్చే దేవుడవు (2)
అడిగిన బతిమాలిన సాయం చేయని లోకంలో
అడగకమునుపే అక్కరలన్నీ ఎరిగిన తండ్రివి
నాకున్నది నీవే - నా యేసయ్యా -
ప్రాణమున్నంతవరకు నిన్ను నే విడువను (2)
యేసయ్యా యేసయ్య - నాకున్నది నీవే (2)
I. నే అడిగినవి ఎన్నో నీవు కాదనియన్నా -
అర్థంకాక నీ ప్రేమ నీపై నే అలిగితినయ్యా
నే కోరిన బంధాలెన్నో నీవు దూరం చేసినా -
పగిలిన హృదయముతో నీకే దూరమైతిని
నే అడిగిన వాటికన్నా అధికముగా చేసినావు -
నే కోరినవాటికంటే నా క్షేమము కోరే తండ్రివి..
{నాకున్నది నీవే}
II. అవసరాలు ఎన్నో ఉన్నా అవకాశమే కానరాక -
చేతులన్నీ ఖాళీయాయి దిగులుతో నిలిచితినయ్యా
మేలులెన్నో పొందినవారే కీడుచేయ చూసినా -
లేనిపోని మాటలతో గుండెనే చీల్చినా
ఖాళీఅయిన బ్రతుకును సమృద్ధితో నింపినావు -
పొందిన కీడు వెనకే గొప్పమేలు దాచిన తండ్రివి..
{నాకున్నది నీవే}
III. కన్నవారి కన్నులకే భారమైపోయినా -
కాలమెప్పుడు మారునో అని కన్నీటితో నిలిచినా
ఓటమే అలవాటై అందరికీ అలుసైనా -
బ్రతుకే నాకొద్దంటూ చావునే వెతికిన
కన్నవారికంటే మించిన ప్రేమే చూపినావు -
చావును వెతికిన నన్నే విడువక నాకై వచ్చిన తండ్రివి..
{నాకున్నది నీవే}

Sharing Button Hover Effect
Follow Us

   Jesus Words