LOADING


Pastor Rajesh Ipc
  • Home
  • About Us
  • Live Telecast
  • Videos
  • Bible
  • Dictionary
  • Audio Lyrics
  • Audio Songs
  • Books
  • Image Gallery
  • Location
  • Contact Us
  • Donate
menu


నను విడువలేదయ్యా


నను విడువలేదయ్యా నేను పారిపోయిన
వెదకినన్ను పట్టుకున్నావు
నీకు దూరమైనను నిను కాదనిపోయినా
వెంటాడి హత్తుకున్నావు  //2//
నీ ప్రేమ నిత్యము వెంబడిస్తూనే ఉండయ్యా
నీ కృప నను విడువక కనికరిస్తూనే ఉండయ్యా  //2//
వందనాలయ్యా యేసు వందనాలయ్యా
వందనాలయ్యా యేసు వందనాలయ్యా  //2//
1
మొండిజీవితమేనాది మార్చుకోరనిది
అహంకారమైనాలో అలలై పొంగుచుండెను  //2//
అన్నీ ఉన్నాయన్న గర్వం
నీ మధుర స్వరం వినలేకపోయింది //2//
అకాస్మాత్తుగా నా జీవితం అంధకారంలో పడిపోయింది
నా హృదయం ముక్కలై చెల్లాచెదురైపోయింది  //2//
// నీ ప్రేమ నిత్యము //
2
గాఢాంధకారమే నన్ను నలువైపు చుట్టుకున్నది
బ్రతుకుతానన్న ఆశే లేకుండా కృంగజేసెను  //2//
కన్నీళ్లతో మోకాళ్లపై కూర్చొని
మొరపెట్టి ప్రార్థించుచున్నాను  //2//
ఆ చీకటి రోజుల్లో ప్రత్యక్షమయ్యావు దివ్య వెలుగులతో నను నింపెవు
నా స్థితిగతులే మార్చేసినావు నూతన జీవం నాకిచ్చావు  //2//
// నీ ప్రేమ నిత్యం //

Sharing Button Hover Effect
Follow Us

   Jesus Words