LOADING


Pastor Rajesh Ipc
  • Home
  • About Us
  • Live Telecast
  • Videos
  • Bible
  • Dictionary
  • Audio Lyrics
  • Audio Songs
  • Books
  • Image Gallery
  • Location
  • Contact Us
  • Donate
menu


ఆరాధన పల్లకిలో - ఊరేగుచున్నది


ఆరాధన పల్లకిలో - ఊరేగుచున్నది
పరిశుద్ధుల నీతి క్రియలనే-అలంకారముగా ధరించుకొని
తన ప్రియుని కొరకే - సాగిపోవుచున్నది

క్రీస్తు యేసు రక్తముచేత - జీవించుచున్న సంఘములో
ఉపదేశ క్రమమునకు - సమర్పించుకొంటిని
పరిశుద్ధాత్ముడే - క్రీస్తు యేసు పోలికగా
సంపూర్ణ పరిశుద్ధతకు - నను మార్చును
ఇదే నా ఆశ.. ఇదే నా కోరిక

నిత్యములో నా యేసునితో - సదాకాలముండుట కొరకు
ఇరుకైన మార్గము లో - సాగిపోవుచున్నాను
పరిశుద్ధాత్ముడే - తొట్రిల్లిపోకుండా
నా ప్రాణ ప్రియుని యొద్దకు - నన్ను చేర్చును
ఇదే నా ఆశ... ఇదే నా కోరిక

గొట్ఱెపిల్ల వివాహ సమయం - సమీపముగ ఉన్నది అనుచూ
పరలోకమంతయు - పరవశించుచుండగా
పరిశుద్ధాత్ముడే - సిద్ధపడిన సంఘమును
వరుడైన యేసునకు - అప్పగించు శుభవేళ
సదాకాలము - యేసుతో ఉందును


 

Sharing Button Hover Effect
Follow Us

   Jesus Words