
ఆరాధన స్తుతి ఆరాధన
ఆరాధన స్తుతి ఆరాధన ఆత్మతో సత్యముతో నీకే ఆరాధన తండ్రియైన దేవా-కుమారుడైన ప్రభువా - పరిశుద్దాత్మ దేవా త్రియేక దేవా ఆరాధన స్తుతి ఆరాధన } 2 సర్వసృష్టికి ఆధారుడా-సకలజీవుల పోషకుడా } 2 సీయోనులోనుండి దీవించువాడవు సదాకాలము జీవించువాడవు సాగిలపడినే నమస్కరించి సర్వదా నిను కొనియాడేద-నిన్నే కీర్తించెద } 2|| తండ్రియైన || సార్వత్రిక సంఘస్థాపకుడా-సర్వలోక రక్షకుడా } 2 సిలువలో నీ రక్తమే నాకై కార్చితివి శిథిలము కాని నగరమును కట్టితివి స్తోత్రము చెల్లింతు నీ కీర్తి తలచి సర్వలోకాన నీమహిమను నేను ప్రకటింతును } 2|| తండ్రియైన || సర్వసత్యమునకు ఆధారమై-పరిశుద్ధయాజకుల సారధివై } 2 యాజక రాజ్యములో నను చేర్చుటకై నిత్యయాజకత్వమును ధరింపజేసితివి మహిమతో పరిచర్య నే చేయుటకై నూతన కృపలను నే పొందెద-ఆత్మతో శక్తితో సాగేద } 2


Follow Us