
ఆరాధన… ఆరాధన…
ఆరాధన… ఆరాధన… ఆరాధన… ఆరాధన… ఆరాధన యోగ్యునికి ఆరాధనను చెల్లించెదము సర్వము ఎరిగిన సర్వేశ్వరునికి సర్వ సంపదలు కురిపించు వానికి సత్య మార్గములో నడిపించు వానికి ఆరాధన చెల్లించెదము ||ఆరాధన|| చీకు చింతలు చుట్టూ ముట్టిన బ్రతుకు గుండె బరువై పోయిన ఆదరించి ఓదార్చే వానికి ఆరాధన చెల్లించెదము ||ఆరాధన|| ఆత్మ ఫలములు ఫలించుటకు ఆత్మ వారములు కురిపించువానికి ఆత్మ అభిషేకం దయచేయువానికి ఆరాధన చెల్లించెదము ||ఆరాధన|| మార్గము నేనే సత్యము నేనే జీవము నేనే అని పలికిన యేసు తండ్రీ కుమారా పరిశుద్ధాత్మకు ఆరాధన చెల్లించెదము ||ఆరాధన||


Follow Us