
ఆరాధనకు యోగ్యుడా
ఆరాధనకు యోగ్యుడా - నా స్తుతి స్తోత్రార్పుడా నా జీవాధిపతియైన యేసయ్యా - నీ కృప నాకు చాలును ప్రభువా శిధిలమైన శిలవలే వుంటిని శిల్పకారుడవై కనికరము చూపితివి నీ ఉలి చేతపట్టితివి నాకై నీ పని నాలో ప్రారంభించితివి జీవనదివై ప్రవహించితివి ఎందరి బ్రతుకులనో చిగురింపచేసితివి తిరిగి జన్మింప చేసితివి నీలో ఇకను జీవించు వాడను నే కానుగా నా జీవితమొక - నాటక రంగముగా చీకటి తెరవెనుకను కనుమరుగైపోగా నాకు వినిపించే జీవన రాగాలు బ్రతుకుపై ఆశ కలిగించె నీ మాటలు


Follow Us