
ఆరాధించుటకు నీ నామమేగాక
ఆరాధించుటకు నీ నామమేగాక - వేరొక నామము లేదాయే యేసయ్యా.. తరతరములకు నీవే మాదేవుడవు నీ నామమున ప్రార్థన చేయు జనులను విడిపించి నడిపించినావు పాలుతేనెలు ప్రవహించు దేశములో క్షేమముగానే నివసింపచేసితివి నమ్మదగిన దేవుడవు నీవే సాటిలేరు ఇలలో నీకెవ్వరు ఆ కాలములో పరజనులము మేము నిజమైన దేవుని ఎరుగనివారము ఈ కృపాకాలములో ప్రభువా నీ రక్తము ద్వారా సంధి చేసితివి తండ్రితో మము ఐక్యపరచితివి నిబంధన జనులని ముద్రవేసితివి నీ సంఘములో స్తుతి ఆరాధనలో రుచిచూపితివి పరిశుద్ధాత్మను నాలో నివసించి నాతోడుగా నడిచే పరిశుద్ధాత్ముని ఆదరణ పొందితిని ఇహపరమందున ఇక నా సహవాసము తండ్రి కుమార పరిశుద్ధాత్మునితో


Follow Us