
ఆరాధించెద ఆత్మతో సత్యముతో
ఆరాధించెద ఆత్మతో సత్యముతో రాజ్యాలనేలే రారాజువు నీవని నా యేసురాజా భూపతుల కధిపతివి నీవేనని రాజా రాజా నా యేసు రాజా భూపతుకదిపతివి నీవేనా రాజా ఆశ్చర్యకరుడవు నీవు - ఆలోచన కర్తవు నీవు బలవంతుడైన దేవా - నిత్యుడగు మా తండ్రీ సమాధాన కర్త వేల్పులలో నీ సాటి కనిపించరే నా స్తుతి స్తోత్రం నీకేనయ్యా అద్వితీయుడవు నీవు - ఆదరణ కర్తవు నీవు ఇమ్మానుయేలు దేవా - ప్రేమగల మా తండ్రీ విమోచన కర్త వేల్పులలో నీ సాటి కనిపించరే నా స్తుతి అర్హణ నీకేనయ్యా అల్పా ఓమెగయు నీవు - ఆమేన్ అను వాడవు నీవు వాక్యమైన దేవా - కరుణగల మా తండ్రీ సర్వసృష్టి కర్తా వేల్పులలో నీ సాటి కనిపించరే నా స్తుతి ఆరాధన నీకేనయ్యా


Follow Us