
అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా
అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా దేవ దూతలు ఆరాధించు పరిశుద్ధుడా యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు నా మనసార నీ సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా సాగిలపడి నమస్కారము చేసేదా ప్రతి వసంతము నీ దయా కిరీటమే ప్రకృతి కలలన్నియు నీ మహిమను వివరించునే ప్రభువా నిన్నే ఆరాధించెద కృతజ్ఞాతార్పణలతో – కృతజ్ఞాతార్పణలతో పరిమలించునే నా సాక్ష్య జీవితమే పరిశుద్ధాత్ముడు నన్ను నడిపించుచున్నందునే పరిశుద్ధాత్మలో ఆనందించెద హర్ష ధ్వనులతో – హర్ష ధ్వనులతో పక్షి రాజువై నీ రెక్కలపై మోసితివే నీవే నా తండ్రివే నా బాధ్యతలు భరించితివే యెహోవా నిన్నే మహిమపరచెద స్తుతి గీతాలతో – స్తుతి గీతాలతో


Follow Us