
ఆరాధించెదము యేసయ్య నామమును
ఆరాధించెదము యేసయ్య నామమును పరిశుద్ధ సంఘముగా అన్ని వేళల మేము ఆరాధన ఆరాధన ఆరాధన - హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా ఆదియందు ఉన్న దేవుడు అద్బుతాలు చేయు దేవుడు అబ్రహాము దేవుడు - ఆత్మయైన దేవుడు అద్వితీయ సత్యదేవుడు - యేసయ్యా అద్వితీయ సత్యదేవుడు దాహము తీర్చుదేవుడు ధన ధాన్యములిచ్చు దేవుడు దావీదుకు దేవుడు - దానియేలు దేవుడు ధరణిలోన గొప్ప దేవుడు - యేసయ్యా ధరణిలోన గొప్పదేవుడు మోక్షమునిచ్చు దేవుడు మహిమను చూపే దేవుడు మోషే దేవుడు - మాట్లాడే దేవుడు మహిమగల నిత్యదేవుడు - యేసయ్యా మహిమగల నిత్యదేవుడు


Follow Us