
ఆలయంలో ప్రవేశించండి అందరు
ఆలయంలో ప్రవేశించండి అందరు స్వాగతం సుస్వాగతం యేసు నామంలో మీ బ్రతుకులో పాపమా కలతలా మీ హృదయంలో బాధలా కన్నీరా మీ కన్నీరంతా తుడిచి వేయు రాజు యేసు కోసం ||ఆలయంలో|| దీక్ష స్వభావంతో ధ్యాన స్వభావమై వెదికే వారికంతా కనబడు దీపము యేసు రాజు మాటలే వినుట ధన్యము వినుట వలన విశ్వాసం అధికమధికమై ఆత్మలో దాహము తీరెను రారండి ఆనందమానందం హల్లెలూయా ||ఆలయంలో|| ప్రభు యేసు మాటలే పెదవిలో మాటలై జీవ వృక్షంబుగా ఫలియించాలని పెదవితో పలికెదం మంచి మాటలే హృదయమంతా యేసు ప్రభుని ప్రేమ మాటలై నింపెదం నిండెదం కోరెదం పొందెదం ఆనందమానందం హల్లెలూయా ||ఆలయంలో||


Follow Us