
ఆశ తీర నా యేసు స్వామిని కొలిచెదను
ఆశ తీర నా యేసు స్వామిని కొలిచెదను ఆత్మతో సత్యముతో స్తుతించెదను ఎంత ధన్యము యేసుని వెదకుట ఎంత ధన్యము ఎంత భాగ్యము యేసుని నమ్ముట ఎంత భాగ్యము ||ఆశ|| దుప్పి నీటికై ఆశపడునట్లుగా దేవుని కొరకై ఆశ పడుచున్నాను దేవుని సన్నిధిని నిత్యముండునట్లుగా (2) దిన దినమాశతో కనిపెట్టుచున్నాను ||ఎంత|| లోక ఆశలు లయమైపోవును లోకులెవ్వరు కాపాడలేరు లోపాలు సరిచేయు ప్రభువే ఆధారం (2) లోబడు వారిని పారమున చేర్చును ||ఎంత||


Follow Us