
ఆశతో నీ కొరకు ఎదురుచూచుచుండగా
ఆశతో నీ కొరకు ఎదురుచూచుచుండగా . నూతన బలముతో నను నింపినావు (2) బలహీనులను బలపరచువాడా కృంగిన వారిని లేవనెత్తువాడా (2) యేసయ్యా నా ఆశ్రయమా యేసయ్యా నీకే ఆరాధన (2) ||ఆశతో|| సొమ్మసిల్లక అడుగులు తడబడక నడిచెద నీ వెంట జీవితమంతా (2) లోకము నన్ను ఆకర్షించినా వెనుదిరుగక నేను సాగెద నీ వెంట (2) ||యేసయ్యా|| అలయక నేను పరుగెత్తెదను అంతము వరకు ఆత్మల రక్షణకై (2) సిద్ధము చేసిన బహుమానముకై గురియొద్దకే నేను సాగెదనయ్యా (2) ||యేసయ్యా|| రెక్కలు చాపి పక్షి రాజువలెనే పైకెగెరెద నీ పరిశుద్ధులతో (2) పరవశించెదను నీ ముఖమును చూచి ప్రణమిల్లెద నీ పాదముల చెంత (2) ||యేసయ్యా||


Follow Us