
ఆశ్చర్య కార్యముల్ చేయును యేసు
ఆశ్చర్య కార్యముల్ చేయును యేసు (2) అద్భుతములతో నిన్ను నడుపును – ప్రార్థించుమా నిత్యము నీ మార్గము నీ భారము సమర్పించుమా ప్రభుకు (2) ||ఆశ్చర్య|| రాత్రంతా వాలా వేసినా ఫలితమేమి రాలేదుగా యేసయ్యా చిన్న మాట చెప్పగా వలలు నిండెను జాలరుల మదిలో ఆనందమే యేసుతో పనిలో ఆశ్చర్యమే (2) హోసన్నా జయము నీకే – రాజువు నీవేగా (2) ||ఆశ్చర్య|| కనులతో చూసేవి ఉండలేవు చిరకాలం యేసు మాట నిలుచును తరతరాలు తండ్రిలా పోషించి దీవించును తల్లిలా ఆదరించి ప్రేమించును (2) హోసన్నా జయము నీకే – రాజువు నీవేగా (2) ||ఆశ్చర్య||


Follow Us