
ఆశ్చర్యకరుడా నీదు కృపా
ఆశ్చర్యకరుడా నీదు కృపా - అనుదినం అనుభవించెద -2 ఆది అంతము లేనిది - నీ కృప శాశ్వతమైనది -2 ప్రేమతో పిలిచి నీతితో నింపి - రక్షించినది కృపయే -2 జయ జీవితమును చేసెదను - అమూల్యమైన కృపతో -2 ॥ ఆశ్చర్య ॥ ఆకాశము కంటె ఉన్నతమైనది - నీ దివ్యమైన కృపయే -2 పలు మార్గములలో స్థిరపరచినది - నవనూతన కృపయే -2 ॥ ఆశ్చర్య ॥ యేసయ్యా - నీ కృపాతిశయము నిత్యము కీర్తించెదను -2 నీ కృపను గూర్చి పాడెదను - ఆత్మానందముతో -2 ॥ ఆశ్చర్య ॥


Follow Us