LOADING


Pastor Rajesh Ipc
  • Home
  • About Us
  • Live Telecast
  • Videos
  • Bible
  • Dictionary
  • Audio Lyrics
  • Audio Songs
  • Books
  • Image Gallery
  • Location
  • Contact Us
  • Donate
menu


ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త


ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త
నిత్యుడగు తండ్రి సమాధానకర్త (2)
తనవంటి గొప్ప దేవుడు ఎవరున్నారిలలో
తన సాటైనా దీటైనా దేవుడు లేడిలలో (2)     ||ఆశ్చర్యకరుడు||

తన చేతిలో రోగాలు లయమైపోయెను
తన చూపుతో దయ్యాలు విలవిలలాడెను (2)
తన మాటతో ప్రకృతినే శాసించినవాడు (2)
నీటిపై ఠీవిగా నడచినవాడతడు (2)      ||ఆశ్చర్యకరుడు||

మనకోసం తన ప్రాణాన్నే బలి ఇచ్చినవాడతడు
మనకోసం సజీవుడై లేచినవాడతడు (2)
తన శాంతినే పంచిపెట్టిన శాంతమూర్తి యేసు (2)
తన సర్వాన్నే ధారబోసిన త్యాగశీలి క్రీస్తు (2)    ||ఆశ్చర్యకరుడు||

Sharing Button Hover Effect
Follow Us

   Jesus Words