LOADING


Pastor Rajesh Ipc
  • Home
  • About Us
  • Live Telecast
  • Videos
  • Bible
  • Dictionary
  • Audio Lyrics
  • Audio Songs
  • Books
  • Image Gallery
  • Location
  • Contact Us
  • Donate
menu


బహు సౌందర్య సీయోనులో


బహు సౌందర్య సీయోనులో స్తుతి సింహాసనాసీనుడా 
నా యేసయ్య నీ ప్రేమ పరిపూర్ణమై నా హృదయాన కొలువాయెనే 
నను జీవింపజేసే నీ వాక్యమే  నాకిలలోన సంతోషమే

పరిశుద్ధతలో మహనీయుడవు - నీవంటి దేవుడు జగమునలేడు (2)
నాలో నిరీక్షణ - నీలో సంరక్షణ నీకే నా హృదయార్పణ (2)

ఓటమి నీడలో క్షేమము లేక - వేదన కలిగిన వేళలయందు (2)
నీవు చూపించిన నీ వాత్సల్యమే నా హృదయాన నవజ్ఞాపిక (2)

ఒంటరి బ్రతుకులో కృంగిన మనసుకు - చల్లని నీ చూపే ఔషధమే (2)
ప్రతి అరుణోదయం నీ ముఖదర్శనం నాలో నింపెను ఉల్లాసమే (2)


Sharing Button Hover Effect
Follow Us

   Jesus Words