
ఇంత కాలం నీదు కృపలో కాచిన దేవా
ఇంత కాలం నీదు కృపలో కాచిన దేవా (2) ఇకను కూడా మాకు తోడు నీడ నీవే కదా (2) ||ఇంత కాలం|| ఎన్ని ఏళ్ళు గడచినా – ఎన్ని తరాలు మారినా (2) మారని వీడని ప్రేమే నీదయ్యా మార్చిన నా జీవితం నీకే యేసయ్యా (2) ||ఇంత కాలం|| నీవు చేసిన మేలులు – తలచుకుందును అనుదినం (2) నా స్తుతి స్తోత్రము నీకే యేసయ్యా వేరుగా ఏమియు చెల్లించలేనయ్యా (2) ||ఇంత కాలం|| దూరమైతిరి ఆప్తులు – విడచిపోతిరి నా హితులు (2) శోధన వేదన తీర్చిన యేసయ్యా తల్లిలా తండ్రిలా కాచిన యేసయ్యా (2) ||ఇంత కాలం||


Follow Us