
ఇంత వరకు నీ సన్నిధిలో
ఇంత వరకు నీ సన్నిధిలో - దాచి కాపాడి నడిపించినావు లెక్కించలేని స్తుతులతో నా పూర్ణ హృదయ స్తోత్రములివిగో మహోన్నతుడా - మహాఘనుడా స్తుతుల మధ్యన నివసించువాడా లేని వాటిని ఉన్నట్టుగానే పిలుచువాడా ఆరాధనా నీకే స్తుతి ఆరాధన నీకే మహిమాన్వితుడా - పునరుత్థానుడా మరణపు ముల్లును విరచినవాడా మహిమగల నీ పరిచర్య కొరకు - పిలిచినవాడా ఆరాధన నీకే స్తుతి ఆరాధనా నీకే మొదటి వాడవు - కడపటి వాడవు ఎన్నటికి నను విడువని వాడవు కోటి సూర్య ప్రభావములకన్న - తేజరిల్లు వాడవు ఆరాధన నీకే స్తుతి ఆరాధన నీకే


Follow Us