LOADING


Pastor Rajesh Ipc
  • Home
  • About Us
  • Live Telecast
  • Videos
  • Bible
  • Dictionary
  • Audio Lyrics
  • Audio Songs
  • Books
  • Image Gallery
  • Location
  • Contact Us
  • Donate
menu


ఇంతగ నన్ను - ప్రేమించినది


ఇంతగ నన్ను - ప్రేమించినది
నీ రూపమునాలొ - రూపించుటకా -2
ఇదియే - నాయెడ నీకున్న నిత్య సంకల్పమా
నాయెడ నీకున్న నిత్య సంకల్పమా

శ్రమలలో సిలువలో - నీ రూప నలిగినదా... -2
శిలనైనా నన్ను- నీవలె మార్చుటకా

శిల్పకారుడా - నా యేసయ్యా...
మలుచుచుంటివా - నీ పొలికగా -2
ఇదియే - నాయెడ నీకున్న నిత్య సంకల్పమా
నాయెడ నీకున్న నిత్య సంకల్పమా

తీగలు సడలి - అపస్వరములమయమై... -2
ముగబోయెనే - నా స్వర్ణ మండలము

అమరజీవ - స్వరకల్పనలు
నా అణువణువునా  - పలికించితివా -2
ఇదియే - నాయెడ నీకున్న నిత్య సంకల్పమా
నాయెడ నీకున్న నిత్య సంకల్పమా   ||ఇంతగ నన్ను||

Sharing Button Hover Effect
Follow Us

   Jesus Words