
ఇదియే సమయంబు
ఇదియే సమయంబు రండి యేసుని జేరండి ఇక సమయము లేదండి – రండి రక్షణ నొందండి పాపులనందరిని – తన దాపున చేర్చుటకై ప్రాణము దానముగా తన ప్రాణము నిచ్చెనుగా మరణపు ముల్లును విరిచి – విజయము నిచ్చెనుగా రాజుల రాజైన యేసు రానై యుండెనుగా గురుతులు జరిగెనుగా – మీరు సరిగా చూడండి తరుణముండగానే – మీరు తయ్యారవ్వండి బుద్ది లేని కన్యకవలె – మొద్దులుగానుంటే సిద్దెలలో నూనె పోసి – సిద్ధపడకపోతే తలుపులు తట్టినను – మీకు తెరువడు సుమ్మండి వెలుపటనుంటేను మీరు వేదన నొందెదరు తలుపులు తట్టినను – మీకు తెరువడు సుమ్మండీ మిమ్మును ఎరుగను – మీరెవరో పోమ్మనును సందియ పడకండి – మీరు సాకులు చెప్పకను గురుతులు జరిగెనుగా – మీరు సరిగా చూడండి మరణ దినమూ మన – మెరుగము సుమ్మండీ జాలము చేయకను – మీరు హేళన చేయకను కులము స్థలమనుచూ – మీరు కాలము గడువకనూ తరుణముండగానే – మీరు త్వరపడి రారండి


Follow Us