
ఇదే నా కోరిక
ఇదే నా కోరిక నవ జీవన రాగమాలిక (2) ||ఇదే నా కోరిక|| యేసు లాగ ఉండాలని యేసుతోనే నడవాలని (2) నిలవాలని గెలవాలని యేసునందే ఆనందించాలని (2) ||ఇదే నా కోరిక|| ఈ లోకంలో పరలోకము నాలోనే నివసించాలని (2) ఇంటా బయట యేసునాథునికే కంటిపాపనై వెలిగిపోవాలని (2) ||ఇదే నా కోరిక|| యాత్రను ముగించిన వేళ ఆరోహనమై పోవాలని (2) క్రీస్తు యేసుతో సింహాసనము పైకెగసి కూర్చోవాలని (2) ||ఇదే నా కోరిక||


Follow Us