
ఇదే నా హృదయ వాంఛన
ఇదే నా హృదయ వాంఛన నీవే నా హృదయ స్పందన నిన్ను చూడాలని – నిన్ను చేరాలని నా బ్రతుకు నీలో నే సాగని నీ యందు నిలిచి ఫలియించాలని నీ అడుగు జాడలోనే నడవాలని ఈ లోక ఆశలన్ని విడవాలని నీ సువార్తను ఇలలో చాటాలని ఆశతో నీ కొరకై నే వేచియుంటిని యేసయ్యా యేసయ్యా నా ప్రాణం నీవయ్యా నీకన్నా ఈ లోకాన నాకెవరున్నారయ్యా ప్రతి వారు నీవైపు తిరగాలని ప్రతి వారి మోకాలు వంగాలని ప్రతి నాలుక నిన్నే స్తుతియించాలని ప్రతి ఆత్మ ప్రార్ధనలో నిండాలని ఆశతో నీ కొరకై నే వేచియుంటిని యేసయ్యా యేసయ్యా నా ప్రాణం నీవయ్యా నీకన్నా ఈ లోకాన నాకెవరున్నారయ్యా ప్రతి చోట నీ పాట పాడాలని ప్రతి చోట నీ సువార్త చేరాలని ప్రతి వారికి రక్షణ కావాలని ప్రతి వారు నీ సన్నిధి చేరాలని ఆశతో నీ కొరకై నే వేచియుంటిని యేసయ్యా యేసయ్యా నా ప్రాణం నీవయ్యా నీకన్నా ఈ లోకాన నాకెవరున్నారయ్యా


Follow Us