LOADING


Pastor Rajesh Ipc
  • Home
  • About Us
  • Live Telecast
  • Videos
  • Bible
  • Dictionary
  • Audio Lyrics
  • Audio Songs
  • Books
  • Image Gallery
  • Location
  • Contact Us
  • Donate
menu


ఇద్దరొక్కటిగ మారేటి


ఇద్దరొక్కటిగ మారేటి మధురమైన క్షణము
దేవుని చిత్తములో పెనవేసిన నిత్య అనుబంధము (2)
వివాహమన్నది అన్నింట ఘనమైనది
ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి (2)

ఒంటరైన ఆదామును చూసి
జంట కావాలని మది తలచి (2)
హవ్వను చేసి జతపరచి – ఫలించమని దీవించెను
సృష్టిపైన అధికారముతో – పాలించుమని నియమించెను (2)           ||వివాహమన్నది||

ఏక మనసుతో ముందుకు సాగి
జీవ వృక్షముకు మార్గము ఎరిగి (2)
సొంత తెలివిని మానుకొని – దైవ వాక్కుపై ఆనుకొని
సాగిపోవాలి ఆ పయనం – దేవుని కొరకై ప్రతి క్షణం (2)           ||వివాహమన్నది||

భార్య భర్తలు సమానమంటూ
ఒకరి కోసము ఒకరనుకుంటూ (2)
క్రీస్తు ప్రేమను పంచాలి – సాక్ష్యములను చాటించాలి
సంతానమును పొందుకొని – తండ్రి రాజ్యముకు చేర్చాలి (2)           ||వివాహమన్నది||

Sharing Button Hover Effect
Follow Us

   Jesus Words