LOADING


Pastor Rajesh Ipc
  • Home
  • About Us
  • Live Telecast
  • Videos
  • Bible
  • Dictionary
  • Audio Lyrics
  • Audio Songs
  • Books
  • Image Gallery
  • Location
  • Contact Us
  • Donate
menu


ఇమ్మానుయేలుగ నను యెడబాయక


ఇమ్మానుయేలుగ నను యెడబాయక
రక్షణ ప్రాకారముగ నాకు తోడై
వేటగాని ఉరి నుండి విడిపించి
పర్వత శిఖరముపై నిలిపితివి
నీకే నా స్తుతి గానము - నీవే నా జయగీతము

కోరుకొంటివి నీకొరకు నన్ను
జనుల మధ్యన నిను మహిమపరచుటకు
మహిమగల నీ పరిచర్యలోనే పరిమళించెదను - పరిమళించెదను
నీకే నా స్తుతి గానము నీవే నా జయగీతము

నీవు నాకు ఎత్తైన కోటగా - ఆపద్దినమున ఆశ్రయపురముగా
ఉన్నావు తోడుగ పునరుత్థానుడవై
ఆదరణకర్తగా - ఆదరణకర్తగా
నీకే నా స్తుతి గానము నీవే నా జయగీతము

గుండె చెదరిన సమయములోన
గాయముకట్టి బాగుచేసితివి
కలవరపడకుము కార్యము జరుగును
మహిమను చూచెదవు - మహిమను చూచెదవు
నీకే నా స్తుతిగానము - నీవే నా జయగీతము

Sharing Button Hover Effect
Follow Us

   Jesus Words