
ఇయ్యాల ఇంట్ల రేపు మంట్ల
ఇయ్యాల ఇంట్ల రేపు మంట్ల (2) ఏది నీది కాదే యేసయ్య నీకు తోడే (2) ||ఇయ్యాల|| నువ్వు తొడిగే చెప్పులకు గ్యారెంటి ఉంది జేబుల పెన్నుకు గ్యారెంటి ఉంది (2) గుండు సూదికి గ్యారెంటి ఉంది నీ గుండెకు గ్యారెంటి లేదే (2) ||ఇయ్యాల|| ఎం ఏ చదువులు చదివే అన్న బి ఏ చదువులు చదివే అన్న (2) ఎం ఏ చదువులు ఏటి పాలురా బి ఏ చదువులు బీటి పాలురా (2) ||ఇయ్యాల|| మేడలు మిద్దెలు ఎన్ని ఉన్నా అందం చందం ఎంత ఉన్నా (2) యేసయ్య లేనిది ఎన్ని ఉన్నా ఎన్ని ఉన్నా అన్ని సున్నా (2) ||ఇయ్యాల|| సబ్సే బడా రూపాయంటావు రూపాయీ అన్నిస్తదంటావు (2) రూపాయీ పరలోకమివ్వదు రూపాయీ సంతోషమివ్వదు (2) ||ఇయ్యాల||


Follow Us