
జీవప్రదాతవు నను రూపించిన
జీవప్రదాతవు నను రూపించిన శిల్పివి నీవే ప్రభు జీవనయాత్రలో అండగానిలిచే తండ్రివి నీవేప్రభు జగములనేలే మహిమాన్వితుడా - నా యెడ నీ కృపను జాలిహృదయుడా నాపై చూపిన వీడని నీ ప్రేమను ఏమనిపాడెదనూ - ఏమని పొగడెదను శుభకరమైన తొలిప్రేమనునే - మరువక జీవింప కృపనీయ్యవా (2) కోవెలలోని కానుకనేనై - కోరికలోని వేడుక నీవై జతకలిసి నిలిచి - జీవింపదలచి కార్చితివి నీరుధిరమే నీ త్యాగ ఫలితం నీ ప్రేమ మధురం నా సొంతమే యేసయ్యా నేనేమైయున్న నీ కృపకాదా - నాతో నీ సన్నిధిని పంపవా (2) ప్రతికూలతలు శృతిమించినను - సంధ్యాకాంతులు నిదురించినను తొలివెలుగు నీవై - ఉదయించినాపై నడిపించినది నీవయ్యా నీ కృపకు నన్ను పాత్రునిగా చేసి బలపరచిన యేసయ్యా మహిమను ధరించిన యోధులతో కలసి - దిగివచ్చెదవు నాకోసమే (2) వేల్పులలోన బహుఘనుడవు నీవు - విజయవిహారుల ఆరాధ్యుడవు విజయోత్సవముతో - ఆరాధించెదను అభిషక్తుడవు నీవని ఏనాడూపొందని ఆత్మాభిషేకముతో నింపుము నా యేసయ్యా


Follow Us