
ఉన్నతప్రేమను నాపైన చూపించి
ఉన్నతప్రేమను నాపైన చూపించి ఆశ్చర్యకార్యములు నా కొరకు కనుపరచి నా ప్రతి కన్నీరు నీ కవిలలో ఉంచి నా జీవ మార్గమై నాముందు నడచి సంతోష వస్త్రమును ధరింపజేసితివి స్తుతి జయ ధ్వనులను నా నోట ఉంచితివి నీ వాక్యమే విశ్వాసయాత్రకు వెలుగైయుండెను ఆ జీవవాక్కు నీకై నడిపెను నిను మోయుటకు కలనైన కనలేదే ఈ జీవితం ఊహించలేదే ఈ అద్భుతం నీ కృప బాహుళ్యమే - నీతో నన్ను నడిపెనే ఆరాధన స్తుతి ఆరాధన (2) నీ రక్తమే క్రయధనమై నన్ను సంపాదించెను రక్తమే పరిశుద్ధపరచి నీకై నిలిపెను నా మనస్సాక్షిని నిందారహితముగ- నీ యెదుట నిలుపుటకై సిద్దపరచితివి మహిమగల సంఘముగ నన్ను నీ యెదుట నిలబెట్టుము ఆరాధన స్తుతి ఆరాధన (2) నీ ఆత్మయే మండింప చేయుచు అభిషేకించెను ఆత్మీయ వరములు కృపావరములు సమృద్ధిగా ఇచ్చెను నా ప్రాగేశ్వరా ఆత్మస్వరూపి - నీ పోలికగ నన్ను మార్చుచుంటివా త్వరగా రానైయున్న యేసయ్యా నీకొరకే జీవింతును ఆరాధన స్తుతి ఆరాధన (2)


Follow Us