
ఉల్లసించుమా భూలోక
ఉల్లసించుమా భూలోక జనమా శ్రీయేసు నామమును పల్లవించగా పరలోక ఆనందం హృదయసీమయండు సృష్టియంత స్తుతులు పాడగా ఓమానవా సృష్టికర్తను స్తుతింపవా ఊగేటి పైరులన్ని సాగేటి ఏరులన్ని సంద్రమై స్తుతులను వినిపించు చున్నవి పూచేటి పువ్వులన్ని వీచేటి గాలులన్నీ చెప్పలేని ఆహ్లాదం పంచుచున్నవి ఎగిరేటి పక్షులన్ని తిరిగేటి జీవులన్ని రారాజు మహిమను వివరించు చున్నవి చల్లటి వాగులన్ని పచ్చటి తీగెలన్ని ఆ యేసు పనులను ప్రచురించుచున్నవి


Follow Us