
ఊహించలేనయ్యా - నాకింత భాగ్యమని
ఊహించలేనయ్యా - నాకింత భాగ్యమని ఊహకు మించినవి - నాయెడల నీ కార్యములు యేసయ్యా నీ కార్యములు నా యిల్లు ఏపాటిది నా బ్రతుకు ఏపాటిది నే పుట్టి పెరిగినదంత నీకు తెలిసియున్నది నన్నెంతో ప్రేమించి శాశ్వతకృప చూపించి నీ వారసునిగా మార్చిన పరలోక రాజువు నీవు ఆత్మీయ కన్నులు లేక నిన్ను చూడలేకపోతిని శాంతిలేని ధనవంతుడనై సంతోషము కోల్పోతివి ఈ చీకటి మార్గములో ధృవతారగ నిలిచి నెమ్మది కలిగించె మార్గమును చూపించితివి ఎంత దూరమైన గాని ఎంత భారమైనా గాని అలసిపోను ఎన్నడు - వెనుతిరిగి చూడను నీ వాక్యమే నా బలం అభిషేకమే నా ధైర్యం జయశీలుడా నిను చూస్తు గురియొద్దకే సాగెదను


Follow Us