LOADING


Pastor Rajesh Ipc
  • Home
  • About Us
  • Live Telecast
  • Videos
  • Bible
  • Dictionary
  • Audio Lyrics
  • Audio Songs
  • Books
  • Image Gallery
  • Location
  • Contact Us
  • Donate
menu


ఊహించలేని మేలులతో నింపిన


ఊహించలేని మేలులతో నింపిన
నా యేసయ్యా నీకే నా వందనం (2)
వర్ణించగలనా నీ కార్యముల్
వివరించగలనా నీ మేలులన్ (2)       ||ఊహించలేని||

మేలుతో నా హృదయం తృప్తిపరచినావు
రక్షణ పాత్రనిచ్చి నిను స్తుతియింతును (2)
ఇశ్రాయేలు దేవుడా నా రక్షకా
స్తుతియింతును నీ నామమున్ (2)     ||ఊహించలేని||

నా దీనస్థితిని నీవు మార్చినావు
నా జీవితానికి విలువనిచ్చినావు (2)
నీ కృపకు నన్ను ఆహ్వానించినావు
నీ సన్నిధి నాకు తోడునిచ్చినావు (2)   ||ఊహించలేని||

Sharing Button Hover Effect
Follow Us

   Jesus Words