
ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి
ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి (2) చక్కనైన జంటగా ఇద్దరొక్కటగుటేమిటో దేవుని సంకల్పం ఇది సృష్టిలోని చిత్రం – (2) ఒంటరి బ్రతుకును విడిచెదరు ఒకరి కొరకు ఒకరు బ్రతికెదరు (2) పెళ్లినాటి నుండి తల్లి దండ్రుల వదలి భార్య భర్తలు హత్తుకొనుటేమిటో ||దేవుని|| గత కాల కీడంతా మరచెదరు వీనులతో సంతసించెదరు (2) పెళ్లినాటి నుండి ఒకరి కష్టం ఒకరు ఇష్టముతో పంచుకొనుటేమిటో ||దేవుని|| ఫలియించి భూమిని నింపెదరు విస్తరించి వృద్ధి పొందెదరు (2) పెళ్లినాటి నుండి మా కుటుంబం అంటూ ప్రత్యేకముగా ఎంచుకొనుటేమిటో ||దేవుని||


Follow Us