
ఎటు చూచినా యుద్ధ సమాచారాలు
ఎటు చూచినా యుద్ధ సమాచారాలు ఎటు చూచినా కరువూ భూకంపాలు ఎటు చూచినా దోపిడీ దౌర్జన్యాలు ఎటు చూచినా ఎన్నో అత్యాచారాలు ఓ సోదరా ఓ సోదరీ (2) రాకడ గురుతులని తెలుసుకోవా తినుటకు త్రాగుటకు ఇది సమయమా ||ఎటు|| మందసము నీ ప్రజలు – గుడారములో నివసిస్తుండగ యోవాబుని సేవకులు దండులో నుండగను (2) తినుటకు త్రాగుటకు భార్యతో నుండుటకు (2) ఇది సమయమా.. ఇది సమయమా.. అని ఆనాడు ఊరియా దావీదునడిగాడు ఈనాడు నిన్ను కూడా ప్రభువు అడుగుచున్నాడు ||ఎటు|| నా పితరుల యొక్క – సమాధులుండు పట్టణము పాడైపోయెను పాడైపోయెను (2) యెరూషలేము గుమ్మములు అగ్ని చేత కాల్చబడగా (2) సంతోషముగ నుండుటకు ఇది సమయమా.. అని ఆనాడు నెహెమ్యా పర రాజునడిగాడు ఈనాడు నిన్ను కూడా ప్రభువు అడుగుచున్నాడు ||ఎటు|| ఈనాడు దేశంలో ఎన్నో ఎన్నో దౌర్జన్యాలు సజీవ దహనాలు స్త్రీల మానభంగాలు (2) ఎన్నో గుడులు నేల మట్టం చేయబడుచుండగా (2) తినుటకు త్రాగుటకు ఇది సమయమా అని నీ సృష్టికర్తగు యేసు నిన్ను అడుగుచున్నాడు ఈనాడు దేశం కొరకు ప్రార్ధించమన్నాడు ||ఎటు||


Follow Us