
ఎడబాయని నీ కృప
ఎడబాయని నీ కృప నను విడువదు ఎన్నటికీ యేసయ్యా నీ ప్రేమానురాగం నను కాయును అనుక్షణం శోకపు లోయలలో – కష్టాల కడగండ్లలో కడలేని కడలిలో – నిరాశ నిసృహలో అర్ధమేకాని ఈ జీవితం ఇక వ్యర్థమని నేననుకొనగ కృపా కనికరముగల దేవా నా కష్టాల కడలిని దాటించితివి విశ్వాస పోరాటంలో – ఎదురాయె శోధనలు లోకాశల అలజడిలో – సడలితి విశ్వాసములో దుష్టుల క్షేమమునే చూచి ఇక నీతి వ్యర్థమని అనుకొనగ దీర్ఘశాంతముగల దేవా నా చేయి విడువక నడిపించితివి నీ సేవలో ఎదురైన – ఎన్నో సమస్యలలో నా బలమును చూచుకొని – నిరాశ చెందితిని భారమైన ఈ సేవను ఇక చేయలేనని అనుకొనగ ప్రధాన యాజకుడా యేసు నీ అనుభవాలతో బలపరిచితివి


Follow Us