
ఎంత పెద్ద పోరాటమో
ఎంత పెద్ద పోరాటమో అంత పెద్ద విజయమో (2) పోరాడతాను నిత్యము విజయమనేది తథ్యము (2) వాక్యమనే ఖడ్గమును ఎత్తి పట్టి విశ్వాసమనే డాలుని చేత పట్టి (2) ముందుకే దూసుకెళ్లెదన్ యెహోవాదే యుద్ధమనుచు (2) ||ఎంత|| ప్రార్థన యుద్ధములో కనిపెట్టి సాతాను తంత్రములు తొక్కి పెట్టి (2) ముందుకే దూసుకెళ్లెదన్ యెహోవా నిస్సీ అనుచు (2) ||ఎంత|| యేసు కాడిని భుజమున పెట్టి వాగ్ధాన తలుపు విసుగక తట్టి (2) ముందుకే దూసుకెళ్లెదన్ సిలువలో సమాప్తమైనదనుచు (2) ||ఎంత||


Follow Us