
ఎంతో సుందరమైనది
ఎంతో సుందరమైనది పరలోక రాజ్యము - ఎంతో వేడుకై యున్నది దేవుని రాజ్యము ఎంతో ఆనందమైనది - అంతయింత అని ఎంచుటకు దానంతు తెలియదు కొంతమందికి సంతసమున సద్గురుని పాదముల చెంత చేరిన అంతరాత్మలకు ఏడువందల ఏబది కోసుల - ఎత్తు వెడల్పు సమానములతో ఎత్తు వెడల్పు సమాములతో - వెలుగుచున్నది యెహోవా పట్టణము తూర్పువైపున మూడు గుమ్మములు - పడమరవైపున మూడు గుమ్మములు ఉత్తరవైపున మూడు గుమ్మములు - దక్షిణ వైపున మూడు గుమ్మములు పండ్రెండు గుమ్మములతో నెపుడు - ప్రబలుచున్న పరిశుద్ధ పట్టణము మొదటి గుమ్మము సూర్యకాంతము - రెండవ గుమ్మము నీలాంబరము మూడవ గుమ్మము యమునారాయి - నాల్గవ గుమ్మము పచ్చరాళ్ళతో ఐదవ గుమ్మము వైడూర్యాలతో - ఆరవ గుమ్మము కెంపురాళ్ళతో ఏడవ గుమ్మము సువర్ణ రత్నము - ఎనిమిదవ గుమ్మము గోమేధికము తొమ్మిదవ గుమ్మము పుష్యరాగము - పదియవది సువర్ణ సునీయము పదకొండవది పద్మరాగము - పండ్రెడవది సుగంధము సూర్యుడు లేడు - చంద్రుడు లేడు - చుక్కలాంటి నక్షత్రాల్లేవు దేవుని మహిమ గొర్రెపిల్ల వలె తేజోత్సవమై వెలుగు చుండును


Follow Us