LOADING


Pastor Rajesh Ipc
  • Home
  • About Us
  • Live Telecast
  • Videos
  • Bible
  • Dictionary
  • Audio Lyrics
  • Audio Songs
  • Books
  • Image Gallery
  • Location
  • Contact Us
  • Donate
menu


ఎందుకింక కన్నీరు


ఎందుకింక కన్నీరు ఎందుకావేదన
నీ దుఃఖదినములన్ని సమాప్తమైనవని
తెలుసుకొ నేస్తమా యేసయ్య మాటిది

పరలోక మహిమను - నీ కొరకు విడిచెను
తన ప్రాణము పెట్టి - నిన్ను బ్రతికించెను
ఇంత చేసినవాడు - నీకు దూరమౌతాడా
సందేహమును వీడి సిలువదర్శనము పొంది
బ్రతికితే క్రీస్తు కొరకు చావైతే లాభమనుకొ
ప్రాణమా ... నాలో ... తొందరపడకుమా

మన్ను అడ్డుగుందని - మొలకెత్తకుందువా
రాళ్ళు రువ్వుతారని - ఫలించకుందువా
ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలె
పెరిగెను యేసయ్యా ద్రాక్షావల్లిగా
అంటుగట్టబడి నీవు బహుగా ఫలించుమా
ప్రాణమా ... నాలో ... తొందరపడకుమా

అపజయముల మధ్య - వెనుకంజ వేయకుమా
పోరాడుచున్నది - అంధకారశక్తులతో
దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొని
దూపార్తి చేబూని స్తుతియాగము చేయుచు
జయమే ఊపిరిగా గురియొద్దకే సాగిపో
ప్రాణమా ... నాలో ... తొందరపడకుమా

Sharing Button Hover Effect
Follow Us

   Jesus Words