
ఎనలేని ప్రేమ నాపైన చూపి
ఎనలేని ప్రేమ నాపైన చూపి నీ వారసునిగ చేసినావు నీ ప్రేమ నేను చాటెదన్ నా సర్వం నీవే యేసయ్యా నా శిక్షకు ప్రతిగా – ప్రాణము పెట్టిన దేవా నీ సత్య మార్గములో – నను నడిపిన ప్రభువా నీ కృప చేత రక్షించినావే నీ ఋణము నే తీర్చగలనా తండ్రి లేని నాకు – పరమ తండ్రివి నీవై ఒంటరినైయున్న నాతో – నేనున్నానని అన్నావు కన్నీరు తుడచి నన్నాదరించిన ఆ జాలి నే మరువగలనా


Follow Us