
ఎనలేని స్తుతులతో
ఎనలేని స్తుతులతో ఆరాధింతును ప్రభువా దీన మనసుతో నిన్నే కొలుతునయ్యా నీ నామ గానం నాకెంతో మధురం - నీ దివ్య వాక్యం నాకెంతో భాగ్యం నీ కార్యములే బహు ఆశ్చర్యములు నీ కానుకలే ఎనలేని ఘనులు నీ సన్నిధి మా పెన్నిధి - నా కాశ్రయమైన నా దుర్గమా మా జీవితమును వెలిగించినావు నీ మార్గమున మరలించినావు సన్మార్గమందు నడిపించినావు - దుర్మార్గులందరిని రక్షించినావు దరిచేరి నమ్మిన దీనులందరిని నీ ఆత్మ ద్వారా నడిపించినావు


Follow Us