
ఎన్నెన్నొ మేళ్ళను అనుభవించిన
ఎన్నెన్నొ మేళ్ళను అనుభవించిన నేను ఏమని ఎన్నని వివరించగలను యుగయుగాలలో ఎన్నెన్నో అనుభవించవలసిన నేను ఆ పౌరత్వము కొరకే పోరాడుచున్నాను ॥2॥|| ఎన్నెన్నొ || స్వార్ధప్రియులు కానరానీ వెయ్యేళ్ళ పాలనలో స్వస్ధబుద్ది గలవారే నివసించే రాజ్యమదీ ॥2॥ స్థాపించునే అతిత్వరలో నాయేసు ఆరాజ్యమును చిత్తశుధ్ధిగలవారే పరిపాలించే రాజ్యమదీ ॥2॥|| ఎన్నెన్నొ || భూనివాసులందరిలో గొర్రెపిల్ల రక్తముతో కొనబడిన వారున్న పరిశుధ్ధుల రాజ్యమదీ ॥2॥ క్రీస్తుయేసు మూలరాయియై అమూల్యమైన రాళ్ళమై ఆయనపై అమర్చబడుచూ వృధ్ధినొందుచు సాగెదము ॥2॥|| ఎన్నెన్నొ ||


Follow Us