LOADING


Pastor Rajesh Ipc
  • Home
  • About Us
  • Live Telecast
  • Videos
  • Bible
  • Dictionary
  • Audio Lyrics
  • Audio Songs
  • Books
  • Image Gallery
  • Location
  • Contact Us
  • Donate
menu


ఎన్నో మేలులు చేసితివి


ఎన్నో మేలులు చేసితివి - యేసయ్యా నీకే స్తోత్రములు 
అవి మనుష్యలకసాధ్యములు - ఎవరి ఊహలకు అందనివి

నేను పుట్టక ముందే నాయెడల - నీ తలంపులు ఆశ్చర్యము
నేను గిట్టక ముందే ఇచ్చిన - రక్షణ భాగ్యము ఆశ్చర్యము
నేను నా ఇంటివారు - నీ సన్నిధిలో నిలుచుట ఆశ్చర్యము
నా ఆశ్చర్యకరుడా స్తోత్రములు - ఇక ఆనందమే నీతో జీవితము

నా మనో వేదనలో నుండి - మొఱ్ఱపెట్టితిని దీనుడనై
నీ మనోహర వెలుగులో నాకు - కనిపించెను నీ ముఖ దర్శనము
సంపదల ఘని దొరికెను నాకు - లోకముతో ఇక పని ఏముంది
నా కృపానిధివి నీవేనని - పాడనా నలుదిశల నీ కీర్తిని

క్రొత్త తైలముతో నాతలను అంటి - అభిషేకించితివి నీ సేవకొరకు
ధాన్య ద్రాక్షారసముతో నన్ను - పోషించుచుంటివి సంతృప్తిగాను
దయాదాక్షిణ్య పూర్ణుడా నిన్నే - దివారాత్రులు ధ్యానించుకొంటూ
నాగటిమీద చేతిని వెనుతీయక నీ బాహు బలముతో సాగెదను

Sharing Button Hover Effect
Follow Us

   Jesus Words