
ఎలా తీర్చగలనయ్యా
ఎలా తీర్చగలనయ్యా - నీ ఋణమును విరిగి నలిగిన హృదయముతో నిత్యము నిన్ను సేవించుచూ యేసయ్యా నా జీవితం - నీ పాదసేవకే అంకితం ఆరిపోయిన ఈ దీపమును - వెలిగించినావే వెలుగు సంబందిగా - దీప స్తంభముపై నిలిపినావయ్యా యేసయ్యా నా జీవితం - నీ పాదసేవకే అంకితం కూలిపోయిన - ఈ గుడారమును నిలబెట్టినావే సుడి గాలులే వీచినా - నీ చాటున నన దాచినావయ్యా యేసయ్యా నా జీవితం - నీ పాదసేవకే అంకితం పిలుచుకొంటివే - దూతలు చేయని నీ దివ్య సేవకు మందసము మోసే - అభిషేకమును ఇచ్చినావయ్యా యేసయ్యా నా జీవితం - నీ పాదసేవకే అంకితం


Follow Us